Surya Kanguva Movie New Look : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో మూవీ తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మళ్లీ అలరించనున్నారు. ఆ సినిమానే “కంగువా”. శివ దర్శకత్వంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సూర్య 42 ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మేకర్స్ లాంచ్ చేసిన గ్లింప్స్ వీడియో, కంగువ పోస్టర్లు నెట్ ఇంట్లో తెగ వైరల్ అయ్యాయి.
సినిమాపై అంచనాలను భారీ ఎత్తున పెంచేశాయి. సూర్య న్యూ లుక్ తో తాజాగా కంగువా లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ అయితే ఈ కంగువా 2024 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ఫైనల్ అయినట్టుగా కూడా ఒక న్యూస్ లీక్ అయింది.
దీనికి సంబంధించి త్వరలోనే అధికారిగా ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలింనగర్ లో సర్కిల్ ఇన్సైడ్ టాక్. అలాగే సెకండ్ లుక్ లాంచ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట సూర్య టీం. ఇటీవలే సూర్య టీం హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. స్టూడియో గ్రీన్ – యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువలో దిశా పటాని ఫిమేల్ రోల్ చేస్తున్నారు.
బాబిడియోల్ కీ రోల్ లో నటిస్తున్నాడు. కంగువా 3డి ఫార్మాట్ లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు, సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుత కాలానికి, గతానికి మధ్య ఉండే కనెక్షన్ తో సాగే స్టోరీ లైన్ ఆధారంగా కంగువ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య వారియర్, లీడర్, కింగ్ ఇలా డిఫరెంట్ షేడ్స్ లో, నయా అవతార్లో కనిపించబోతున్నట్టు ఇప్పటివరకు తెలిసిన సమాచారం. మరోవైపు సూర్య, సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43 లో కూడా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.