గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 40 వేలకు పైగా పాటలు పాడి తెలుగు పాటకు ఎనలేని కీర్తి తీసుకువచ్చారు. ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతో మంది యువ గాయకులను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో టీవీ షోలు మన ముందుకు వచ్చాయి. ఈటీవీ నిర్వహించిన షో మాత్రమే అత్యధిక ప్రజాదరణ పొందింది. కానీ ఇప్పుడు ZEE తెలుగు ఛానల్లో వస్తున్న సరిగమప The Singing Icon షో ఆ స్థాయి ఆదరణ పొందుతుంది.
ఈ షో లో ఎంతోమంది యువ గాయకులు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. యశశ్వి కొండేపూడి, అనన్యా భాస్కర్, చైతన్య, పవన్,తేజ,పవన్ కళ్యాణ్, ఇలా ఎంతోమంది యువ గాయకులు ప్రేక్షకులను తమ గానంతో మైమరిపిస్తున్నారు.
వీరిలో ముఖ్యంగా యశశ్వి కొండెపూడి అనే యువకుడు కొద్ది రోజుల క్రితం శర్వానంద్ హీరోగా నటించిన “జాను” చిత్రంలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాట అతన్ని ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడు సంగీత ప్రియులు అందరూ మాతృకలో ఉన్న గొంతు కంటే యశస్వి పాటనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నెట్టింట్లో అతను పాడిన పాట వైరల్ అవుతుంది. యువత సెల్ ఫోన్ లలో రింగ్ టోన్, కాలర్ ట్యూన్ గా మారుమోగుతుంది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్లో 9.7 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతుంది. ఇంకో విశేషం ఎంటి అంటే యశస్వి పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట విని అతని అభిమానిగా మారిన అమ్మాయ్ అదే షో లో అతనికి ప్రపోజ్ చేయడం.
ఈ పాట విన్న శర్వానంద్ యశశ్వి ని మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం అతడికి మరింత గుర్తింపు తీసుకువచ్చింది. యశశ్వి పాడిన మరోపాట పవన్ కళ్యాణ్ నటించి త్వరలో విడుదల కాబోతున్న వకీల్ సాబ్ చిత్రంలోనీ “మగువా మగువా” పాటను చూసి ఆ పాట మాతృకలో పాడిన సింగర్ సిద్ శ్రీరామ్ యశస్విని మెచ్చుకోవడం విశేషం. సాధారణంగా కాంటెస్టంట్ పాడిన పాటను జడ్జెస్ మెచ్చుకోవడం సహజం కానీ ఆ పాట ఒరిజినల్ సింగర్సే స్వయంగా మెచ్చుకోవడం అనేదే యశస్వి విషయంలో ప్రత్యేకత.
ఇదే జోరు కొనసాగిస్తే యశస్వి రూపంలో తెలుగు చిత్ర సీమకి మరో స్టార్ సింగర్ దొరికినట్టే అని అంటున్నారు తెలుగు రాష్ట్రాల సినీ సంగీత అభిమానులు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మంది కళాకారులు వెలుగు లోకి రావాలని ఆశిద్దాం.