పుష్ఫ హీరోయిన్ రష్మిక మందన్న ‘గుడ్‌బై’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న దక్షిణాదిలో తన నటనతో అందరినీ తనవైపుకు తిప్పుకునేలా చేసింది. ఛలో సినిమా తో తెలుగు లో జర్నీ మొదలెట్టిన రష్మిక సౌత్‌లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసింది. అయితే ఇన్ని రోజులు సౌత్ కే పరిమితమైన రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
పుష్ప సినిమా కి ముందే బాలీవుడ్ రావాలి అని ఉన్న సరైన టైమెక్కోసం ఎదురు చూసింది ఈ భామ. పుష్ప నేషనల్ లెవల్ లో భారీ విజయం సొంతం చేసుకున్నాక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇప్పుడు “గుడ్‌బై” సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. గుడ్‌బైలో రష్మికతో పాటు అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తన తొలి చిత్రంలోనే ప్రముఖ నటీనటులతో నటించే అవకాశం రష్మికకు దక్కింది. ఈ మధ్య రష్మిక గుడ్‌బై ప్రమోషన్‌లో బిజీగా బిజీ గా గడుపుతోంది. ఈ చిత్రం వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు సహా పలు దక్షిణాది సినిమాల్లో మెరిసిన రష్మిక బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడానికి కారణం ఉంది. ఈమధ్య “గుడ్‌బై” ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో రష్మిక నటన బాగా నచ్చేట్టుగానే ఉంది, ఇప్పుడు హిందీ ప్రేక్షకులు ట్రైలర్ చూసాక సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అసలు బాలీవుడ్‌లోకి ఎందుకు అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నానో అని ఇప్పుడు రష్మిక వెల్లడించింది.
గుడ్‌బై ప్రమోషన్ లో భాగంగా కోసం ఢిల్లీకి వచ్చింది. అక్కడ మీడియాతో కాసేపు ముచ్చటించింది రష్మిక, మీడియాతో మాట్లాడిన రష్మిక, తాను బాలీవుడ్‌లోకి ఎందుకు అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నానో చెప్పింది. నా బాలీవుడ్ అడుగులకి కారణం తన అభిమానులే అని రష్మిక చెప్పింది.
రష్మిక మాట్లాడుతూ ‘ఇక్కడ ప్రేక్షకుల వల్ల నేను హిందీ స్క్రిప్ట్‌ని వినడం ప్రారంభించాను, ఎందుకంటే వారు నన్ను ఇక్కడికి వచ్చి సినిమా చేయాలనుకుంటున్నారు. మేము మీ సినిమాలు చూడాలనుకుంటున్నాము. ఇంతలో, పుష్ప వచ్చింది అని చాలామంది అభిమానుల ప్రతిస్పందనతో నేను షాక్ అయ్యాను అందుకే ఈ రోజు నేను “గుడ్ బై” సినిమా ఇక్కడకు వచ్చాను.
ఈ చిత్రంలో రష్మికతో పాటు పావెల్ గులాటి, ఎల్లి అవ్రామ్, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా మరియు అభిషేక్ ఖాన్ కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ సెప్టెంబర్ 7 న విడుదల చేసారు. గుడ్‌బైలో రష్మిక తండ్రిగా అమితాబ్ బచ్చన్, తల్లిగా నీనా గుప్తా కనిపించనున్నారు.