పవన్ కళ్యాణ్ కి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఇప్పటికీ టాలీవుడ్ లో ఓపెనింగ్స్ కింగ్ ఎవరూ అంటే అందరూ పవర్ స్టార్ పేరే చెప్తారు. పవన్ కళ్యాణ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా, టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘ఖుషి’ ని ఇటీవలే రీ రిలీజ్ చేసారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.
ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు కలెక్షన్స్ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ చిత్రం. ఈ సినిమా రీ రిలీజ్ ఆ రేంజ్ సూపర్ హిట్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ పాత సూపర్ హిట్ సినిమాలను మరోసారి రీ రిలీజ్ చెయ్యడానికి బయ్యర్స్ ఎగబడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీన పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన తొలిప్రేమ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే కచ్చితంగా ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వస్తుందని బయ్యర్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్.. ఖుషి రీ రిలీజ్
మరోపక్క మార్చి నెలలో ఫ్యాన్స్ బద్రి సినిమాని రీ మాస్టర్ చేయించి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజున గుడుంబా శంకర్ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత నాగబాబు ప్లాన్ చేస్తున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమాలన్నీ రీ రిలీజ్ చేసి ఆయనకీ ఉన్న క్రేజ్ ని బాగా క్యాష్ చేసుకుంనేందుకు సిద్ధమయ్యారు బయ్యర్స్.