Most Followed South India Actors on Instagram : ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. సినితారాలైతే ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు.
అలా సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. అలా ఇన్‌స్టాలో టాప్ 5 ఫాలోయర్స్ ఉన్న సౌత్ ఇండియన్ హీరోలను ఇప్పుడు చూద్దాం(Most Followed South Indian Celebrities On Instagram)..
1) అల్లు అర్జున్:
బన్నీకి ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 20మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే 2 కోట్ల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ లో ఈ రికార్డు అందుకున్న తొలి కథానాయకుడు అల్లు అర్జున్ కావడం గమనార్హం.
2) విజయ్ దేవరకొండ :
18 మిలియన్ ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు రౌడీ హీరో విజయ్. అర్జున్ రెడ్డి హిట్ తో విజయ్ కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. పాన్ ఇండియా మూవీ లైగర్ నిరుత్సాహ పరిచిన విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
3) యశ్ :
సౌత్ లో మరో క్రేజీ హీరో యశ్. 13 మిలియన్స్ తో టాప్ 3లో ఉన్నాడు యశ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’తో యశ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగిపోయింది.
Also Read: లోకేష్ సీఎం కలకు వైసీపీ సాయం.. (దోస్త్ మేరా దోస్త్)
4) రామ్ చరణ్ , దుల్కర్ సల్మాన్ :
మెగాస్టార్ చిరంజీవి తనయుడు గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. గత యేడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ తో చెర్రీ గ్లోబల్ లెవల్ లో గుర్తింపు పొందాడు. తాజాగా చరణ్ 12 మిలియన్ ఫాలోవర్స్ తో 8వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకాడు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. మహానటి, సీతా రామం తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో రామ్ చరణ్ ఇతను 4వ స్థానంలో ఉన్నారు.
5) మహేష్ బాబు:
9.6 మిలియన్ ఫాలోవర్స్‌తో 5వ స్థానంలో ఉన్నారు సూపర్ స్టార్. మోస్ట్ హ్యండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న మహేష్ కి అమ్మాయిల్లోనే కాదు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. త్వరలో త్రివిక్రమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మహేష్.