Trisha : కొంతమంది హీరో హీరోయిన్లకి వయసు పెరుగుతున్నప్పటికీ అందం, అభినయం వంటివి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో వీరు వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తదితర సినిమా పరిశ్రమలలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన కోలీవుడ్ బ్యూటీ త్రిష కృష్ణన్ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు.
ఆరుపదుల వయసులో హీరోలకి Trisha మంచి ఆప్షన్:
కాగా ఇటీవలకాలంలో త్రిష ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మరియు తన పాత్రకి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి చిత్రాలలో నటిస్తోంది. దీంతో గత కొద్ది నెలలోనే ఈ అమ్మడి సినీ కెరియర్ గ్రాఫ్ కాస్త అమాంతం పెరిగింది. దీనికి తోడు ఆరుపదుల వయసు పైబడిన హీరోలకి హీరోయిన్లు దొరకకపోవడంతో ప్రస్తుతం త్రిష కృష్ణన్, నయనతార, అనుష్క శెట్టి వంటి హీరోయిన్లకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

SV Krishna Reddy : సౌందర్య విషయంలో ఆ హీరోతో వివాదంపై స్పందించిన డైరెక్టర్..
స్టార్ హీరోలతో త్రిష(Trisha) చిత్రాలు:
అయితే త్రిష ఇటీవలే టాలీవుడ్ లో కూడా ప్రముఖ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇక మలయాళంలో ప్రముఖ దర్శకుడు జీతూ జోసఫ్ మరియు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “రామ్” అనే చిత్రంలో కూడా కీలకపాత్రలో నటిస్తోంది.
తమిళంలో ప్రముఖ స్టార్ హీరో కమలహాసన్ మరియు దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్” చిత్రంలో కూడా హీరోకి జతగా నటిస్తోంది. దీంతో ప్రస్తుతం త్రిష వరుస ఆఫర్లతో రోజు బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే స్టార్ హీరోలతో చిత్రాలు తగ్గట్టుగానే పారితోషకం కూడా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనాప్పటికీ నటి త్రిష కృష్ణన్ తో పాటు కెరియర్ మొదలుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకొని, అలాగే ఇతర రంగాల్లో సెటిల్ అయిపోయారు.
Sivaji : హీరో శివాజీ ఒకప్పుడు అలాంటి పని చేసేవాడని మీకు తెలుసా..?