Trivikram Next Movie Updates : మాటల మాంత్రికుడు ఏ రకమైన కథతో ముందుకు వచ్చిన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేస్తాడు. ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్ ఖాతాలోనే నిలుస్తుంది. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫ్లాఫ్ కాలేదు అంటే అది త్రివిక్రమం హార్డ్ వర్క్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈయన మహేష్ బాబు తో “గుంటూరు కారం” సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు.
అయితే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి త్రివిక్రమ్ స్కెచ్ వేశాడు. దీని తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఫై ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన అల్లు అర్జున్ తో సినిమా తీస్తాను అని ఒక మారు అనౌన్స్ చేశారు. అందరూ కూడా ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
కానీ పరిస్థితులను చూస్తే మాత్రం అల్లు అర్జున్ “పుష్పా ది రూల్” సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. దాని తర్వాతనే త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. పుష్పా ది రూల్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు కు గాని పూర్తి కాదు. మరి ఆలోపు త్రివిక్రమ్ ఆగుతాడా.. లేకపోతే ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని ప్రేక్షకులకు అందిస్తాడా.. అని అందరూ డౌటుగా ఉన్నారు.
ఈ డౌట్స్ ని క్లియర్ చేస్తూ ఒక వార్త ఇప్పుడు నెట్ ఇంట్లో చాలా హల్చల్ చేస్తుంది. త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో నానితో సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాని తో సినిమా తర్వాతనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే నాని త్రివిక్రమ్ కాంబినేషన్లో మంచి మూవీని మనం ఎంజాయ్ చేయవచ్చు. చూడాలి దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో..