2018 జనవరిలో విడుదలైన అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ లో ఒప్పుకున్న చిత్రం “వకీల్ సాబ్”
లాక్ డౌన్ కు ముందే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమైంది. కానీ కరోనా కారణంగా అటు షూటింగులు లేకపోవడం ఇటు ఏడు నెలలుగా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి.
అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒక్కో చిత్రం క్రమక్రమంగా సెట్స్ పైకి వెళ్తున్నాయి. వకీల్ సాబ్ యూనిట్ కూడా కొద్దిరోజుల క్రితమే షూటింగ్ పనులు మొదలుపెట్టి మిగిలి ఉన్న కొద్దిపాటి టాకీపార్ట్ పూర్తి చేయడం ప్రారంభించింది.
ఆల్రెడీ యూనిట్ లో జాయిన్ అయిన అంజలి, నివేదా థామస్, మరియు ఇతర పాత్రధారులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దసరా తర్వాత పవన్ సెట్లోకి అడుగు పెడతారు. పవన్, శృతి హాసన్ కాంబినేషన్లో చేయ్యాల్సిన కొద్దిపాటి సన్నివేశాలను పూర్తి చేసి రాబోయే సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన మగువా ఓ మగువా అనే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో 33 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో నటిస్తారు.