యూనిట్ పై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం..
ఎట్టకేలకు కరోనా లాక్ డౌన్ తర్వాత ఒక్కొక్కరుగా అగ్ర హీరోలు అందరూ సెట్లోకి అడుగు పెడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా ముఖ్య తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఈరోజు నుండి పవన్ సెట్ లో అడుగుపెట్టారు.
ఈ విషయం యూనిట్ లోని వ్యక్తులు ఫోటోలు తీసి లీక్ చేసారు. దీనిపై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ లోని వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు లీక్ అయిన పవన్ ఫోటోలు
సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి.
