Varasadu Movie OTT Release : త్వరలో OTT లోకి.. సూపర్ హిట్ సినిమా..
గత సంక్రాంతి కి విడుదల అయి మంచి విజయం సాధించిన చిత్రం “వారసుడు”
తమిళ్ స్టార్ హీరో .. ఇళయ దళపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంగా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “వారసుడు”.
ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమా దాదాపు 300 ల కోట్లకి పైగా కలెక్షన్లు సాధించింది.
అయితే..ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న OTT ప్రేక్షకులకి చిత్ర యూనిట్ తీపి కబురు అందించింది.
ఈ నెల 22 న ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ అయిన “అమెజాన్ ప్రైమ్” లో తమిళ్, తెలుగుతో పాటు మలయాళం లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.