Veera Simha Reddy OTT: నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘వీర సింహారెడ్డి’. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించగా, ఆయన భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది.
Also Read: యువగళం దాటాల్సిన మైలురాళ్లు ఇవే..
తాజాగా డిస్నీ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. థియేటర్ లో మెప్పించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.