Veera Simha Reddy Review : నటసింహ బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం నందమూరి అభిమానులలో పూనకాల తెప్పించే విధంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజు విడుదలయ్యింది.
అఖండ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా గురించి ట్విట్టర్ జనాలు ఏమంటున్నారో చూద్దాం.. ప్రస్తుతానికి ట్విట్టర్‌లో ‘వీరసింహారెడ్డి’ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. కొందరు సినిమా సూపర్‌గా ఉందంటే, మరికొందరు ఇది రొటీన్ స్టోరీ అని పెదవి విరుస్తున్నారు.
మూవీ స్టార్టింగ్‌లోనే డైరెక్టర్ బోర్ కొట్టించాడని, కానీ ఆ తర్వాత సినిమా మెంటల్ పుట్టించిందని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరి నోటా ఎక్కువగా వినిపించే మాట ఈ సినిమాలో బాలయ్య యాక్టింగ్ అద్భుతంగా ఉందని! ఎప్పట్లాగానే బాలయ్య బాబు డైలాగులు టపాసుల్లా పేలాయట. కాకపోతే అవసరంలేని యాక్షన్ సీన్లు, ఫైట్లు, అర్థం లేని స్టోరీ వల్ల ఈ సినిమా బాగా నిరాశపరిచినట్లు ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు.
తమన్ BGM, సాంగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని మరికొందరు అభిప్రాయ పడ్డారు. వీరసింహారెడ్డి సినిమాలో ఫస్టాఫ్ బాగుందని కొందరు అంటుంటే, మరికొందరు సెకండాఫ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ మాస్ సన్నివేశాలతో బాగా మెప్పించిందని కానీ సెకండ్ హాఫ్ సిస్టర్ సెంటిమెంట్, వీక్ విలన్ వల్ల విసుగు పుట్టించిందని అంటున్నారు.
Also Read : Veera Simha Reddy Movie Review in Telugu
నందమూరి బాలకృష్ణ వీరాభిమానులకు తప్ప మిగతా ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు అని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మొత్తానికి ట్విట్టర్ లో మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.