Veera Simha Reddy Team at Unstoppable With NBK : బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో టాక్ షో కూడా చేస్తున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఓటీటీ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 దూసుకు పోతుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకులతో సహా చాలా మంది ప్రముఖులు ఈ షో కి అతిథులు గా విచ్చేశారు. ఇప్పుడు ఆహా వీక్షకుల కోసం ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది. ఈసారి బాలయ్య షోకు వీరసింహా రెడ్డి టీం రానుంది.
రాబోయే ఎపిసోడ్‌లో వీరసింహా రెడ్డి టీమ్ కనిపించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆహా మేకర్స్ విడుదల చేశారు. ఈ షోలో వీరసింహా రెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని, నటి వరలక్ష్మీ శరత్ కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ వారు సందడి చేసే పిక్స్ నెట్టింట విడుదల చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.