రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న రిలేషన్ గురించి గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న రూమర్స్ గురించి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారా(Vijay Devarakonda and Rashmika Mandanna Dating Rumors) అనే సందేహాలు కూడా కలిగాయి. ఈ సినిమాలో తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక తరచూ జంటగా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఒకే లొకేషన్ లో ఉన్న ఫోటోలను విడివిడిగా షేర్ చేయడంతో మరిన్ని అనుమానాలకు కారణమవుతుంది. ఇదిలావుండగా తాజాగా నటి రష్మిక నటించిన వారసుడు, మిషన్ మజ్ను సినిమాలు విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. చాలామంది నేను విజయ్ కలసి సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు.
అయితే ప్రస్తుతానికి తనతో ఎలాంటి సినిమాలు చేయలేదని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది తప్పకుండా తనతో సినిమా చేస్తానంటూ ఈ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండతో సినిమా గురించి హింట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో సినిమా తప్పకుండా చేస్తానని.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెబుతానని చెప్పడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.