అందాల భామ రష్మిక క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్దమతుంది.
ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటించనుంది. అంతేకాకుండా నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా అందుకుంది. అయితే చాలాకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు. రోజులు గడిచే కొద్దీ రష్మిక, విజయ్ ల మధ్య బంధం బలపడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం వీరిద్దరూ మాల్దీవులకు రొమాంటిక్ టూర్ కి వెళుతున్నట్లు తెలుస్తోంది.
పెళ్ళికి ముందే వీళ్ళు రొమాంటిక్ టూర్స్ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. రష్మిక వైట్ డ్రెస్ లో, విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ లో స్టైలిష్ గా కనిపించారు. విజయ్, రష్మిక కలసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.
ఈ రెండు చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై నేడు రిలీజ్ అవుతుండగా.. మరోవైపు రష్మిక.. ప్రియుడితో వెకేషన్ కి వెళ్ళింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..
