Vijay Deverakonda Kushi Movie Release Date : గత కొంతకాలంగా రౌడీ హీరో విజయ్ మూవీస్ ఏం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీ లైగర్ విజయ్ దేవరకొండ కేరీర్ బిగ్గేస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో విజయ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది.
గత సంవత్సరం డిసెంబర్ కే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి కానీ సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ‘ఖుషి’ చిత్రీకరణ ఆలస్యం అయింది. ఇటీవల సామ్ ఆరోగ్యం మెరుగవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది. దీంతో ప్రస్తుతం ఖుషి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
దీంతో తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రెండు భిన్న ప్రపంచాలు సెప్టెంబర్ 1న కలుస్తాయి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. విజయ్ సమంత ఈ చిత్రంలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రాల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.