Vijay Deverakonda Kushi Movie Update : రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ విజయ్ కేరీర్ లో బిగ్గేస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో విజయ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ ని కశ్మీర్లో పూర్తి చేసుకుంది.
అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ‘ఖుషి’ చిత్రీకరణ ఆలస్యం అయింది. వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ ఇటీవల ముంబైలో జరిగిన హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా ఖుషీ మూవీ కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమైంది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రాల్లో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నెక్స్ట్ విజయ్ డైరెక్టర్ పరశురాం, గౌతమ్ తిన్నూరితో చేయనున్నాడు.