Vijay Sethupathi : తమిళ నటుడు విజయ సేతుపతికి ఇప్పుడు దక్షిణాదిలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఒక సాధారణ అకౌంటెంట్ గా జీవితాన్ని ప్రారంభించిన సేతుపతి.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ఆస్కారం ఉన్న ప్రతి పాత్రలో నటిస్తున్నారు. విలన్‌గా సైతం తన సత్తా చాటుతున్నారు. ‘ముంబైకర్’ సినిమాతో ఆయన బాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ప్రస్తుతం అక్కడ ‘జవాన్’ లో విలన్ గా నటిస్తున్నాడు.

షారుక్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తానెందుకు ఈ సినిమాలో నటిస్తున్నారో విజయ్ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షారుక్ ఖాన్ కోసమే ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాణ్ని అంటూ షారుక్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ సేతుపతి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Guntur Kaaram : ‘గుంటూరు కారం’కు మళ్లీ బ్రేక్..
2019లో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలోని సేతుపతి నటనపై షారుక్ నాడు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని సినీ ప్రియులు ఆకాంక్షించారు. ‘జవాన్’తో వారి కోరిక నెరవేరినట్టైంది. ఈ సినిమాలో సమాజంలో జరుగుతున్న తప్పులను సరిదిద్దడానికి సిద్థంగా ఉన్న ఓ వ్యక్తి ప్రయాణాన్ని చూపించనున్నారనీ ఈయన తెలిపారు.
Guntur Kaaram : ‘గుంటూరు కారం’కు మళ్లీ బ్రేక్..