Vinaro Bhagyamu Vishnu Katha OTT: కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ‘రాజాగారు రాణివారు’తో హీరోగా పరిచయమైన కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కటి ఆదరణ పొందింది. ఈ మధ్యే ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ మూవీలో కిరణ్ కు జోడిగా కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నెంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈమూవీ ఈనెల 18న విడుదలై పాసిటివ్ టాక్ సొంతం చేసుకొని, మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వినరో భాగ్యము విష్ణుకథ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.