Virupaksha Teaser : రిపబ్లిక్ మూవీ తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విరూపక్ష. ఇందులో తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ టీజర్ ను చూసి ప్రశంసించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో మిస్టరీ థ్రిల్లర్ గా ఉంది. టీజర్ లోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ కు హైలెట్ అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీను తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. మొదటిసారి సాయిధరమ్ తేజ్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Discussion about this post