Keeravani: చిరంజీవి విశ్వంభర మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ నటిస్తున్నారు. అయితే విశ్వంభర మూవీ మాత్రం చాలాకాలంగా వాయిదా పడుతూ ఉంది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది.
చిరంజీవి, బాలీవుడ్ నటి మౌని రాయ్ మధ్య ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించి షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ విషయంలో విశ్వంభర టీంకి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కీరవాణికి అవమానించారా ?
కానీ స్పెషల్ సాంగ్ కి మాత్రం సంగీత దర్శకుడు బీన్స్ బాణీలు సమకూర్చారు. కీరవాణి లాంటి లెజెండ్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రానికి మరో సంగీత దర్శకుడుతో స్పెషల్ సాంగ్ చేయించడం ఆయన్ని అవమానించడమే అని సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై చిత్ర దర్శకుడు వశిష్ట వివరణ ఇచ్చారు.

విశ్వంభర చిత్ర స్పెషల్ సాంగ్ ని రికార్డ్ చేసే సమయంలో కీరవాణి గారు హరిహర వీరమల్లు చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కీరవాణి గారే స్పెషల్ సాంగ్ ని మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించమని చెప్పారు. అదేంటి సార్ అని అడిగితే అందులో ఎలాంటి తప్పులేదు. ఒక మూవీలో ఒక పాటని ఒకరితో మరో పాటని మరో రచయితతో రాయించుకుంటాం కదా ఇది కూడా అంతే. సమయం లేనప్పుడు ఇలా చేయడం తప్పేమీ కాదు అని కీరవాణి గారే చెప్పారు. అందువల్లే స్పెషల్ సాంగ్ కోసం భీమ్స్ ని తీసుకున్నట్లు డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు