Vishwambhara Story: ఫాంటసీ చిత్రంగా విశ్వంభర
బింబిసార తర్వాత డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. స్టాలిన్ తర్వాత మరోసారి త్రిష చిరంజీవికి జంటగా నటిస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభమైనప్పటి నుంచే అంచనాలు కూడా భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
కానీ విశ్వంభర రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడమే కారణమని చెబుతున్నారు. విశ్వంభర చిత్ర యూనిట్ గతంలో ఓ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో టీజర్ వర్కౌట్ కాలేదు. టీజర్ లో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉందంటూ విమర్శలు వినిపించాయి.
విశ్వంభర స్టోరీ రివీల్ చేసిన డైరెక్టర్
అయితే డైరెక్టర్ వశిష్ట తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వంభర మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వంభర కథని ఓపెన్ గా వశిష్ట బయటకు చెప్పడం ఆసక్తికర పరిణామం. ఇప్పటివరకు విశ్వంభర కథ గురించి అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ దర్శకుడు కథ స్వయంగా చెప్పేయడంతో క్లారిటీ వచ్చేసింది.

ఇంతకీ వశిష్ట ఈ చిత్ర కథ గురించి ఏం చెప్పారంటే.. మనకు తెలిసినవి 14 లోకాలు. ఈ లోకాలన్నింటికీ పైన ఉన్న లోకమే విశ్వంభర లోకం. అక్కడ ఉన్న హీరోయిన్ త్రిషని తిరిగి భూమి మీదకి తీసుకురావడానికి చిరంజీవి 14 లోకాలు దాటి విశ్వంభర లోకానికి వెళతారు. అక్కడ చిరంజీవి పోరాటం చేసి త్రిషని తిరిగి భూమి మీదకు తీసుకు వస్తారు.
టీజర్ ని కావాలనే టార్గెట్ చేశారు
అసలు త్రిష ఆ లోకంలో ఎందుకు ఉంది? చిరంజీవి ఇన్ని లోకాలను దాటి అక్కడికి ఎలా వెళ్ళగలిగారు? అక్కడ ఎవరితో పోరాటం చేశారు ఇలాంటి అంశాలు కథలు ఆసక్తికరంగా ఉంటాయి అని వశిష్ట తెలిపారు. ఈ చిత్ర షూటింగ్లో ఇక ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందని వశిష్ట తెలిపారు. టీజర్ పై వచ్చిన విమర్శలపై క్లారిటీ ఇస్తూ.. కొందరు కావాలని టీజర్ ని టార్గెట్ చేశారని వశిష్ట అన్నారు. ఏది ఏమైనా వచ్చిన విమర్శలను తీసుకున్న.. ఇంకా ట్రైలర్ ఉంది కదా అప్పుడు చూపిస్తా అంటూ వశిష్ట సంచలన వ్యాఖ్యలు చేశారు.