Waltair Veerayya and Veera Simha Reddy Movie Ticket Prices: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలుకానుంది. పండగకు మరో మూడు రోజులు ఉన్నా.. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు ముందాగానే పండగను పరిచయం చేయబోతున్నాయి. ఈ జాబితాలో తెలుగు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు కూడా ఉండటంతో.. ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ రెండు సినిమాల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేకర్స్‌కు ఓ తీపి కబురు ఇచ్చింది. టికెట్ ధరల పెంపు కోసం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకోగా.. టికెట్ ధరపై గరిష్ఠంగా రూ.45 (GST అదనం) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధర రూ.70 పెంచాలని మైత్రీ మూవీ మేకర్స్ కోరగా.. రూ.45 (GST అదనం) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
సంక్రాంతి పండగ తెలుగువారికి ప్రాధాన్యమైనది కావడంతో, అటు ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా ఈ పండగ కలిసి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలను పెంచుతుండటంతో మేకర్స్ మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
