గాడ్‌ఫాదర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో భారీ హిట్ సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తర్వాతి ప్రాజెక్టుగా డైరెక్టర్ బాబీ (కే.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో నటించనున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహారాజా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది.
వింటేజ్ చిరుని బాబీ ప్రజంట్ చేశాడు. ఇదిలావుండగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కొద్దిసేపటి క్రితమే పూర్తయినట్లు సమాచారం. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ లభించిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్(Waltair Veerayya Censor Review and Talk) వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి మార్కు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉండబోతోంది అని సమాచారం.
రవితేజ ఎంట్రీతోనే ఈ సినిమాలో కామెడీ ట్రాక్ మొదలవుతుందట. రవితేజ చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ సినిమా అంతటికి చాలా హైలైట్ గా ఉండబోతుందట. రవితేజ క్లైమాక్స్ లో చనిపోతాడు అని టాక్.
చిరంజీవి శృతిహాసన్ మధ్య జరిగే రొమాంటిక్ యాక్షన్ సీన్స్ కొత్తగా ఉండనున్నాయట. ఇక పాటలు కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా అభిమానులకు వాల్తేరు వీరయ్య ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న వాల్తేరు వీరయ్య కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.