చిరంజీవి హీరోగా రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో నిన్న (ఆదివారం) రాత్రి వైజాగ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో భారీ జన సందోహం నడుమ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడిన మాటలు, సినిమా గురించిన చెప్పిన సంగతులు మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
Photos : Rakul Preet Singh Stunning Photos
తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ రికార్డ్స్ షేక్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ మధ్య షూట్ చేసిన కొన్ని సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉండనున్నాయట. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.