Waltair Veerayya : మరి కొద్ది సేపట్లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ ఇంకో మెయిన్ రోల్ లో నటిస్తుండగా శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్.
దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బాస్ పార్టీ సాంగ్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఇకపోతే ఈ సినిమా లో అన్నిటికన్నా ముఖ్యంగా మెగాస్టార్ లుక్ చాలా బాగుంది . శ్రీదేవి చిరంజీవి సాంగ్లో బాస్ క్లాస్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.
Also Read : Veera Simha Reddy Movie Review in Telugu
ఇక టైటిల్ సాంగ్ లోని మాస్ లుక్ అయితే పూనకాలు లోడింగ్ అన్నట్లే ఉంది. ఈ సాంగ్ లో వచ్చిన మెగాస్టార్ లుక్ గ్యాంగ్ లీడర్ సినిమా టైంలో చిరంజీవిని చూస్తున్నట్టే ఉంది. .మొత్తానికి సినిమాలో అభిమానుల అలరించే అన్ని పాయింట్స్ ని పొందుపరచినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ ని.. ట్రైలర్ ని.. సాంగ్స్ ని గమనిస్తే.. డైరెక్టర్ బాబి పనితనం గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. మెగాస్టార్ ని బాబీ ప్రెసెంట్ చేసిన విధానం చూస్తుంటే రేపు బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అర్ధం అవుతోంది.. చూద్దాం మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో..