వాల్తేర్ వీరయ్య నుండి రెండవ సాంగ్ “నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి..” ఈ రోజు రిలీజ్ అయింది.. మంచి మెలోడియస్ గా సాగిన ఈ పాట మెగాస్టార్ అభిమానులని అలరించే విధంగానే ఉంది.. మంచు కొండల్లో ఫారిన్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట చూడడానికి భలే కలర్ ఫుల్ గా ఉంది. పిక్చరైజషన్ అదిరింది.
లిరికల్ వీడియో మధ్యలో చూపించిన మెగాస్టార్ డాన్స్ మూవ్ మెంట్స్ అయితే అదరహో అనిపించే విధం గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాంగ్ లో మెగాస్టార్ లుక్ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవలసిందే. ఆయన వయసు ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లినట్టే ఉంది. ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయిన “Boss Party” పాటతో పాటు ఈ పాటను కూడా దేవిశ్రీ ప్రసాద్ రాయడం విశేషం. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా లో రవితేజ మరో ముఖ్యమైన పాత్ర పోషించారు.