What is the Meaning of Salar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ “సలార్” ఇప్పటికే భారీ ఓపెనింగ్స్ తో అతిభారి కలెక్షన్లతో దూసుకు వెళ్తుంది. ప్రభాస్ తన సత్తా మరోమారు చాటూకున్నారు. ఒకవైపు డుంకీ సినిమా రిలీజ్ అయిన కూడా, ఈ రెండు సినిమాలలో ఏది ముందంజలో ఉంటుంది అనే ఒక సందిగ్ధం అందరిలో ఉండేది. కానీ షారుఖాన్ ని కూడా పక్కన పెట్టేసి, సలార్ ఒక రేంజ్ లో దూసుకు వెళ్తుంది.
ప్రేక్షకులు మంచి పాజిటివ్ టాక్ ని ఇస్తున్నారు. ఒకవైపు ప్రభాస్ యాక్టింగ్, వేరియేషన్స్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని చూపించిన తీరు, కథనం ఇవన్నీ కూడా ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అసలు సలార్ అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా..? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఆ సినిమాకి ప్రశాంత్ నీల్ ఆ పేరు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి..? అని చాలామంది అనుకున్నారు.
ఆ పేరుకు అర్ధాన్ని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సలార్ అంటే ఒక ఉర్దూ పదం అని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సలార్ కి అర్థం ఒక విజయవంతమైన నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు. రాజుకు అత్యంత నమ్మకంగా అంటే కుడి భుజంగా ఉండేవాడిని సలార్ అని పిలుస్తారని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఆ పేరుకు తగ్గట్టుగానే సినిమా కూడా చాలా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తుంది.