Writer Padmabhushan in OTT: టాలీవుడ్ లో చిన్నచిన్న పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. అనంతరం కలర్ ఫోటోలో హీరోగా చేసిన సుహాస్ ఈ సినిమాతో ఏకంగా నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకోగా.. ఇటీవల అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ మూవీలో నెగిటివ్ రోల్లో నటించి మెప్పించిన సుహాస్. తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రంలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించగా చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆశిశ్ విద్యార్థి, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్లలో ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సుహాస్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీల్లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 రైటర్ పద్మభూషణ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అయితే ఉగాది కానుకగా మార్చి 22న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట మేకర్స్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.