Yatra 2 Movie Teaser Released : వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “యాత్ర”. ఇందులో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రను పోషించి అందులో జీవించారని చెప్పవచ్చు. యాత్ర మూవీ ఇదివరకే రిలీజ్ అయి మంచి స్పందనను కూడా అందుకుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోని వైయస్ జగన్ జీవిత కథకు అనుగుణంగా, ఆధారంగా చేసుకొని యాత్ర 2 మూవీని రిలీజ్ చేస్తున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, వైయస్ జగన్ రాజకీయ జీవితం ఎలా గడిచింది. ఆయన ప్రజా నాయకుడిగా మారడానికి ఎటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అనే అంశాన్ని ప్రధాన కథాంశంగా ఎంచుకొని యాత్ర 2 మూవీ ని తెరకెక్కించారు దర్శకులు. అయితే దీనికి సంబంధించినటువంటి టీజర్ ఇప్పుడు నెటింట్లో హల్చల్ చేస్తుంది. యాత్ర 2 మూవీలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా, వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు.
2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని మహి వి రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం పైన చాలా హోప్స్ ఉన్నాయని చెప్పవచ్చు. యాత్ర మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల గురించి ప్రజల పట్ల ఆయన ఆలోచించిన విధానం గురించి చూపించారు.
ఇక వైయస్ జగన్ ని ఎలా చూపిస్తారో, ఇందులో రాజకీయ అంశాలు ఏమైనా టచ్ అవుతాయా.. అనే నేపథ్యంలో ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విభిన్న కథ చిత్రంతో, విభిన్న అంశాలతో తెరకెక్కుతున్న యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.