Ambedkar statue in Hyderabad : అంబేద్కర్ ఆ పేరు ఒక మార్గదర్శకం, ఆ పేరు ఒక స్ఫూర్తిదాయకం, ఆ పేరు ఒక సమానత్వం..ఆ పేరు ఒక పోరాటం. తన ప్రజల సామాజిక న్యాయం కోసం, భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసం, సమ సమాజం కోసం,దళిత ,గిరిజన,బహుజన అణగారిన వర్గాల కోసం, ఆయన చేసిన పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం,
ఎక్కడైతే వివక్ష ,అణచివేత ఉంటుందో అక్కడ అంబేద్కరుడు పోరాట రూపమై నిలబడతాడు. అణగారిన ప్రజల ఉనికి కోసం ఆయన రాజ్యాంగ నిర్మాత అయి, ముందుండి నడిపించాడు..ఆ చూపుడు వేలు మనకు ఎప్పుడు ఒక దిక్సూచి..ఆయన ప్రజల కోసం చేసిన త్యాగం దేనితో వెలకట్టలేనిది.
అంబెడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాదులో 125 అడుగుల భారి విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ విగ్రహన్నీ హుస్సేన్ సాగర్ తీరంలో, ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకొని 11.80 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఎంతో ఠివీగా విలాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం రేపటినుండి ప్రజలందరికీ దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం భారీ సన్నహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించి ఆ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావువుడికి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి గౌరవం ఇవ్వడం, సామాజిక స్ఫూర్తికి ప్రతీక.
అంబేద్కర్ అంటే కేవలం దళితులకు, అణగారిన వర్గాల కోసం మాత్రమే పోరాడాడు అనే భావనను పోగొడుతూ, అంబేద్కర్ అంటే దళిత ,గిరిజన, బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ, ఆర్థిక ,సామాజిక సమసమానత్వం కోసం కొట్లాడిన వ్యక్తి, అంబేద్కర్ అందరివాడు అని తెలియజెప్పడం కొరకు ఈ విగ్రహ ప్రతిష్ట ఒక నాంది పలుకుతుంది.
అదేవిధంగా సచివాలయానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టి, ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం తెలంగాణ ప్రభుత్వం ఆ మహానుభావుడికి ఇచ్చిన ఘన నివాళి .రాబోయే తరాలకు ఆ మహాశయుడి ఆశలను అందించడం మనందరి బాధ్యత .ఆ ఆశయ సాధనలో మనం కూడా అడుగులు వేద్దాం.