BRS MLA G Sayanna Passed Away : అధికారపార్టీ BRS లో విషాదం…ఎమ్మెల్యే కన్నుమూత..
అధికార BRS పార్టీలో విషాదం. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ యశోదా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకి భార్య… ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ నేపథ్యం:
సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
అలాగే ఆయన అప్పట్లో 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా కూడా నియమితుడయ్యారు. తరువాత కాలంలో ప్రస్తుత కేసీయార్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయన్న కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ యశోదా ఆసుపత్రిలో కన్నుమూశారు..