CM Revanth Reddy’s Orders on Abhaya Hastam : అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు ఫారాలాను స్వీకరించడం కార్యక్రమం మొదలైంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వము, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అభయ హస్తం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫారాలను ప్రభుత్వం నుండే ప్రజలకు అందిస్తున్నారు.
కానీ కొన్ని అవకతవకల వల్ల ప్రజలు అయోమయానికి గురై ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఈ అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా అభయహస్తం దరఖాస్తు చేసే ఫారాలను చాలామంది అవకతవకలకు పాల్పడుతున్నారు. ఆ ఫారాలను బయట సపరేటుగా విక్రయిస్తున్నారు.

ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి ఫారాలను కొనవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండే ఫారాలను అందజేస్తాము. బయట జిరాక్స్ సెంటర్లలో కానీ, అలాగే వేరే వ్యక్తుల నుండి కానీ ఫామ్స్ కొనవలసిన పనిలేదు. మీరు గవర్నమెంట్ నుంచి ఉచితంగా ఈ ఫారాలను స్వీకరించవచ్చు అని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఫారాలను ముందస్తుగా ఉంచాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
ఈ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. ఇకపోతే రైతు భరోసా పింఛన్ల ద్వారా ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి, వారు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత వాటి పైనే అన్ని మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు మాత్రం ప్రజా పాలనలో నూతన దరఖాస్తు చేయవలసి ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
