Delhi Liquor Scam Case : కవిత ఈడి విచారణ కు హాజరవుతుందా, లేదా అని అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణానికి తెర పడింది. ఎవరు ఊహించని విధంగా కవిత ఈడికి షాక్ ఇచ్చింది. అనారోగ్య కారణాల వల్ల తను హాజరూ కాలేక పోతున్నానని తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండడం కూడా కవిత ఈడి విచారణకు హాజరు కాకపోవడంకి ముఖ్య కారణమని తెలుస్తుంది.

కవిత నివాసంలోనే న్యాయమూర్తులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకు ఈడి ముందు హాజరు కావలసిన నేపథ్యంలో కవిత వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. మొదటినుండి కవిత లిక్కర్ స్కామ్ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ మనుగడకే ప్రమాదంగా భావించి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్.
ఎలాగైనా ఈ స్కామ్ లో నుండి కవితను బయటపడేయాలని ఆ పార్టీ చేయని ప్రయత్నాలు లేవు. Cm కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కూడా కవిత నివాసానికి చేరుకొని ఎప్పటికప్పుడు లాయర్లతో చర్చలు జరుపుతూ కవితకు మద్దతుగా ఉన్నారు. ఈడి విచారణకు గైర్హాజరైన కవిత తీరు పట్ల ఈడి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
