Delhi liquor scam Case : లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన కవిత ఆ స్కామ్ నుండి బయట పడటానికి చేయని ప్రయత్నాలు లేవు. ఈ స్కామ్ లో ముఖ్యంగా మొదటి నుండి కవిత పేరే వినిపిస్తోంది అని అందరికి తెలిసిన విషయమే. ఏ క్షణంలో అయినా కవిత అరెస్టు ఉంటుందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల ముందు ఇలాంటి పరిమాణం చోటు చేసుకోవడంతో, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీపై
ఈ ప్రభావం తీవ్ర నష్టం చేకూరుస్తుంది అని భావించిన బిఆర్ఎస్ పార్టీ ఆ స్కామ్ ఉచ్చు నుండి కవితను బయట పడేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈనెల 11న అధికారులు కవితను ఎనిమిది గంటలకు పైగా విచారించారు. విచారణ ఇంకా పూర్తికాలేదు అని, ఈడీ అధికారులు ఈ నెల 16 వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఆ నోటీసులపై తనకు వెంటనే స్టే ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఊహించని విధంగా సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురైంది. ఈడీ నోటీసులపై తాము ఇప్పుడే ఎలాంటి స్టే ఇవ్వలేమని, ఈ కేసుపై తదుపరి విచారణ 24న జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామంతో కవిత రేపు ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావడం తప్పా వేరే మార్గం లేదు.