Divyavani to Join Congress : బాపు బొమ్మగా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు నటి దివ్య వాణి (డివ్య వని).. రాజకీయాలపై ఆసక్తితో ఆ దిశగా అడుగులువేశారు. అసలు తెలుగు దేశం పార్టీలో గుర్తింపు దక్కడం లేదనుకున్నారో అసలు తన వాయిస్ వినిపించనీయడం లేదని బాధపడ్డారో.. కారణం ఏదైనా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. గతంలో ఈటెల రాజేందర్ తో దివ్యవాణి భేటీ అయ్యారు.
సుమారు గంటపైగా వీరి భేటీ జరిగిందని త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకోనుందని ప్రచారం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆచరణ కాలేదు. తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం జోరుగా జరుగుతోంది. నేతలు వరుస పెట్టి గొడ దూకేస్తున్నారు. పార్టీలన్నీ నేతల వలసలపై దృష్టి పెట్టాయి. ఎవరు వస్తే వారిని పార్టీలో చేర్చుకునేందుకు రెడ్ కార్పెట్ వేస్తోన్నాయి.ఎన్నికల్లో తెలంగాణలో తన సత్తా చాటాలని భావిస్తోన్న కాంగ్రెస్‌ఆ దిశగా పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడమే కాకుండా… సినీ గ్లామర్ ను కూడా వాడుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. తాజా రాజకీయ పరిణామాల దృష్యా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో నటి దివ్య వాణి హస్తం తీర్థం పుచ్చు కోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినీ నటి దివ్య వాణితో చర్చ లు జరిపారు. తాజాగా.. ఆ చర్చ లు సఫలం అయినట్లు తెలుస్తోం ది. . దివ్యవాణి ప్రచార వాణి కాంగ్రెస్‌కు ఏ మాత్రం మేలు చేస్తుందో చూదాలి.