Janasena Chief Pawan Kalyan:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 74 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు గారు నిండు, నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా, విపక్ష నేతగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా..కొనసాగి తన సేవలను ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అందించారని,
అలాంటి గొప్ప నేతలు అరుదుగా ఉంటారు,ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు గారు ఎన్నో సంక్షేమ పథకాలు వెలుగులోకి తీసుకువచ్చారు.ఎప్పుడు ఆయన ఆలోచన ప్రజల గురించే ఉంటుంది అని చంద్రబాబు విజయాలను,ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు పవన్ కళ్యాణ్.
చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అన్ని జిల్లాలలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే యువగలం పాదయాత్రలో కూడా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను జరుపనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా # HBDTeluguPrideBabu హ్యాష్ ట్యాగ్ ట్రేండింగ్ లో ఉండి హాల్ చల్ సృష్టిస్తుంది.