JanaSena Formation Day Meeting : ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తా. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్. యాజ్ టీజ్ గా ఈ డైలాగ్ తనకు కరెక్ట్ అని నిరూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా సరికొత్త ఎన్నికల ప్రచార రథాన్ని స్వయంగా సిద్ధం చేయించారు పవన్ కళ్యాణ్. ఇటీవలే కొండగట్టు వద్ద వారాహి వాహనాన్ని పూజ చేయించగా
మొదటిసారి వారాహి వాహనం కదనరంగంలోకి దూకింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహిపై తొలిసారి ర్యాలీ చేపట్టారు. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఈ రోజుకి జనసేన 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జనసేన 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.
ఈ సభ కోసం నోవాటెల్ హోటల్ నుంచి మచిలీపట్నం వరకు వారాహిపై ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పవన్ కు దారిపొడవునా అభిమానులు, జనసైనికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వారాహిని ముందుకు పంపుతున్నారు. సభాస్థలికి పవన్ సాయంత్రం 7 గంటలకు చేరుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Discussion about this post