Janasena Meeting in Machilipatnam : బందరులో పేర్ని నానికి షాక్…జనసేనకి జై కొడుతున్న ప్రధాన అనుచరులు
వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని శిబిరంలో ఒక్కసారిగా కలకం.నాని ప్రధాన అనుచరులు బందరులో ఒక్కొక్కరుగా వైసిపిని వీడి పవన్కళ్యాణ్ నేతృత్వం లోని జనసేన పార్టీలో చేరుతున్నారు.
ఈ నెల 14 న మచిలీపట్నం లో జనసేన తలపెట్టిన ఆవిర్భావ సభకి ముందే ఇలా వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడుతుండటంతో మచిలీపట్నం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నాని సొంత అనుచరులు తాజాగా వైసీపీకి రాజీనామా చేసి జనసేన కి జై కొడుతున్నారు.
ఇందులో ప్రధానంగా పేర్ని నాని ముఖ్య అనుచరుడు కొరియర్ శ్రీను నాయకత్వం లో కొంతమంది కార్యకర్తలు ఆవిర్భావ సభ ఏర్పాట్లు పర్యవేక్షణ చేసేందుకు వచ్చిన జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు.గతంలో కాపు సామాజిక వర్గం అంతా నాని వెంటే ఉన్నారు. కానీ జగన్ అనుసరిస్తున్న పాలనా వైఖరి వల్ల కాబోలు నాని పట్ల ఇప్పుడంత సానుకూలత తో లేరు. అందుకే పార్టీని వీడుతున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయం.ఏదేమైనా జనసేన ఆవిర్భావ సభ ముందే ఇలా ఉంటే, సభ అయ్యాక జనసేన లోకి ఇంకా ఎన్ని వలసలు ఉంటాయో అని పేర్ని నాని వర్గం తెగ ఆందోళన వ్యక్తం చేస్తుంది అట. చూడాలి మరి మచిలీపట్నం సభ ద్వారా జనసేనాని ఇంకా ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో మున్ముందు.