Janasena Meeting Schedule:జనసేన ఆవిర్భావ సభ షెడ్యూల్ విడుదల…. ఎంట్రీ ఇవ్వబోతున్న “వారాహి”
అంత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే వేడుక…పలు సంచలనాలకి వేదిక కాబోతుంది అనే రాజకీయ విశ్లేషకుల మాటలకి ఆద్యం అయిన రాజకీయ “రణ”సభ…అన్ని పార్టీలు మచిలీపట్నం వైపే ఓ కన్నేసే సభ… అదే “జనసేన ఆవిర్భావ సభ”.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కి రంగం సిద్ధం అయింది. కేవలం ఆవిర్భావ సభ అనే కాకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని జనసేన పార్టీ అందుకు తగినట్టు కూడా ప్రజల ముందుకు రాబోతుంది అనేది విశ్లేషకుల మాట…అయితే రాష్ట్రం లోని అన్ని పార్టీలు నిశితంగా గమనించడంతో పాటు, జనసైనికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 14 నాటి మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకి సంభందించిన షెడ్యూల్ తాజాగా విడుదల అయింది.
అత్యంత భారీ జనసమీకరనే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం లో భాగంగా, జనసేనాని ముందుగా 11 శనివారం రోజున మంగళగిరి చేరుకొని, ఆరోజు పార్టీ ఆఫీసులో జరిగే బీసీ సదస్సులో పాల్గొంటారు.ఆ తరువాత 12 ఆదివారం రోజున హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ కాపు నేతలతో సమావేశం అవుతారు.13 సోమవారం నాడు ఏపీకి నూతన గవర్నర్ గా ఇటీవల నియమితులు అయిన అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలపనున్నారు.ఇక ఆ తరువాత 14 న మచిలీపట్నం లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకి తన ఎన్నికల ప్రచార రథం అయిన వారాహి పై ఊరేగింపుగా వెళతారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే 14 న జరిగే ఇట్టి ఆవిర్భావ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.పాలక పక్షం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలని ప్రస్థావించడంతో పాటు,ఆరోజు జరిగే సభలో ముఖ్యంగా జనసేన పార్టీ విధి విధానాలతో పాటు, పొత్తుల అంశాలపై అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన అనుసరించే వ్యూహం పై కూడా జనసైనికులకి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఏదేమైనా ఆవిర్భావ సభ పట్ల ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చే జరుగుతుంది.