Janasena Party : జనసేన పార్టీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఒక ప్రాంతీయ పార్టీ ట్విట్టర్ లో 2 మిలియన్స్ (20 లక్షలు) ఫాలోవర్స్ ను సాధించి రికార్డ్ సృష్టించింది. జనసేన ఈ ఫీట్ సాధించడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘జనసేన పార్టీ 2 మిలియన్ (20 లక్షలు) ఫాలోవర్స్ మార్క్ అందుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు.
జనసేన ట్విట్టర్ టీంకు, సోషల్ మీడియా జనసైనికులకు నా శుభాకాంక్షలు. జనసేన పార్టీకి మీరే ప్రధాన బలం.’’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రధాన రాజకీయ పార్టీకి కూడా ఇంతమంది ఫాలోవర్స్ లేకపోవడం గమనార్హం. ఏపీలోని YCP 8.38 లక్షల మంది ఫాలోవర్స్ తో రెండోస్థానంలో ఉండగా.. తెలంగాణలోని BRS పార్టీ 8.10 లక్షల మందితో మూడో స్థానంలో ఉంది.
2 Million followers for JanaSena Party's Twitter Handle : https://t.co/rC3Ovmcdlt#2MFollowersForJanaSenaParty pic.twitter.com/gp5NzoBXyG
— JanaSena Party (@JanaSenaParty) March 6, 2023