Janasena : ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించడానికి జనసేన సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. అనంతరం ఇతర సంఘాలతో రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్. రేపు ఆవిర్భావ సభకు కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.

కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో.. పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 14న జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉంటుందని..
అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ‘ఛలో మచిలీపట్నం’ తాము నిర్వహిస్తున్నందున.. ప్రభుత్వం కావాలనే ఆంక్షలు విధిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
