KA Paul Shocking Comments about Sharmila : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో వెళ్లి చేరడం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన ఎవరికీ తోచినట్టుగా వారు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఏస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చాలా వింతైన వ్యాఖ్యలను చేశారు.
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు నాకు చాలా పరిచయస్తులు. నేను ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఆయన మరణానంతరం నేను చాలా బాధపడ్డాను. అయితే ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయాల గురించి నేను కాస్త ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో ముందుకు వచ్చిన వైఎస్ షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయం నన్ను చాలా బాధపెట్టింది.
ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే షర్మిల నిర్ణయం పట్ల చాలా బాధపడేవారు. అయితే నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆయన ఆత్మ చాలా ఘోషిస్తుంది. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతికుంటే షర్మిలను కచ్చితంగా ఆపేవారు. రాజకీయం అంటేనే చాలా దరిద్రము, రాజకీయము చాలా అవినీతితో కూడుకొని ఉంటుంది.
రాజకీయాన్నీ మించిన నిచమైన పని మరొకటి లేదు. మన దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటికీ నిలువెత్తు నిదర్శనాలు. మిగతా 200 దేశాల్లో ఎక్కడా లేని రాజకీయ పరిస్థితులు కేవలం మనదేశంలోనే ఉన్నాయి. నిజంగా ఈ రాజకీయ పరిస్థితి మన దేశానికి సిగ్గుచేటు అని కేఏ పాల్ చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.