Kanna Lakshmi Narayana Resigned : ఏపీ బీజేపీకి భారీ షాక్..!!
అంతంతమాత్రం నెట్టుకొస్తున్న ఏపీ బీజేపీకి గట్టి ఎదురుదేబ్బే తగిలింది.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ తో కలిసి అధికారంలోకి వస్తాం.. ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా మాకే ఉంది అని బీరాలు పోతున్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.. బిజెపి సీనియర్ నేత ఆ పార్టీ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బిజెపి కి గుడ్ బై చెప్పారు.
పార్టీతో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు ఆయనకి మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా పార్టీని వీడారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ “ఏపీ రాష్ట్ర బిజెపి పనితీరు సరిగా లేదని.. ప్రజల్లో నమ్మకం భరోసా కల్పించడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలం అయిందని ఆక్షేపించారు. పనితీరు ఇలానే ఉంటే రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ అనేదే లేకుండా పోతుందని అన్నారు.
ఇదిలా ఉండగా కొద్దిరోజులుగా రాష్ట్ర బీజేపీ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి తో ఉన్న కన్నా గారికి టిడిపి అధినేత చంద్రబాబు నుండి పిలుపు వచ్చిందని.. త్వరలోనే ఆయన తన అనుచరులతో భారీ మీటింగ్ పెట్టి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారనే మాటలు వినిపిస్తున్నాయి. టిడిపిలోకి వెళితే గనుక ఆయనకి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు..? ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా లేక ఎంపీగా పోటీచేస్తారా అనే ఆత్రుత నెలకొంది.. దాంతోపాటు అధికారం పక్షం అయిన వైసీపీ తో పాటు బీజేపీ పై ఇక ముఖాముఖీ ఎలా తేల్చుకుంటారో.. ఎలాంటి విమర్శలు చేస్తారో.. కన్నా గారి రాజకీయ భవిష్యత్ ఏంటి?.. ఆయన పోషించే పాత్ర మున్ముందు ఎలా ఉండబోతోంది? అనేది చూడాలి..
ఇవి కూడా చదవండి..