KCR with the Slogan of Regionalism : రాజకీయంలో ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ ది అందవేసిన చెయ్యి. కానీ మొదటిసారి ఆయన పాత పాటనే మళ్లీ కొత్తగా పాడుతున్నారు. ఆ పాటే “ప్రాంతీయత”. ఈ అస్త్రం తోనే గతంలో ఆయన సక్సెస్ ని అందుకున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయాల నేపథ్యంలో తిరిగి మళ్లి అదే “ప్రాంతీయత” అనే అస్త్రాన్ని ప్రయోగించడానికి కేసీఆర్ సిద్ధమైనట్టు సమాచారం.
నిన్నటి మొన్నటి వరకు మనం గమనించినట్లయితే.. కేసీఆర్ కానీ, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కానీ తమ అభివృద్ధిని చెబుతూ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా తమ నినాదాన్ని మార్చారు. దీనికి ముఖ్యం కారణం వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు అయిన షర్మిల కాంగ్రెస్ కు తన మద్దతును ప్రకటించడమే.
ఇదే అదునుగా భావించిన కేసీఆర్ తన స్లోగన్ ని మార్చారు. మొదటి నుంచి కూడా తెలంగాణ ద్రోహులు అనే విమర్శ నినాదాన్ని పార్టీ ప్రచారానికి అనుగుణంగా మలుచుకునేవారు. అచ్చం ఇప్పుడు కూడా “తెలంగాణ ద్రోహులందరూ ఏకమవుతున్నారంటూ” కొత్త స్లోగాన్ న్నీ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులకు అందించారు కేసీఆర్.
తెలంగాణ వ్యతిరేకులు అందరూ జాతీయ పార్టీల ముసుగులో తెలంగాణకు వస్తున్నారు జాగ్రత్త ,తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఓట్లు వేయొద్దు, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనీ కొత్త ప్రచారాన్ని చాలా తెలివిగా మొదలుపెట్టారు కేసీఆర్. ఒక రకంగా చూసుకుంటే వై.ఎస్.ఆర్.టి.పి, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిసి కేసిఆర్ కి కొత్త స్లోగాన్ నీ వాళ్ళ చేతులరా వాళ్ళే అందించినట్టుగా ఉంది పరిస్థితి.
ఇలాంటి ఛాన్స్ దొరికితే ఎవరు మిస్ చేసుకుంటారు.. దొరికిందే అదునుగా బి.ఆర్.ఎస్ నాయకులు ఈ కొత్త స్లోగన్ నీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మరోవైపు, కేసిఆర్ ని వ్యతిరేకిస్తున్న అందరిని కూడా తమ పార్టీ వైపు ఆకర్షించేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ విషయం కూడా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. అందుకే కొత్తగా ఆయన పాత పాటనే మళ్ళీ పాడుతున్నాడు. ప్రాంతీయత అనే భావంతో మళ్ళీ ఒకసారి తన సత్తా ఏంటో చాటాలి అనుకుంటున్నాడు.
అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బి.ఆర్.ఎస్ నే రెండుసార్లు అధికారంలో ఉంది. ఆ రెండు సార్లు కూడా ఈ ప్రాంతీయత అనే నిప్పు రాజేసి ఆ మంటలో చలికాచుకుంటూ వాళ్ళ స్థానాన్ని పదిలంగా భద్రపరచుకున్నారు. అప్పుడంటే ఆంధ్ర, తెలంగాణ వేరు కావాలి , మా తెలంగాణ మాకు కావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతీయత అనే అస్త్రం బాగా పనిచేసింది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అదే ప్రాంతీయత అనే స్లోగన్ తో ముందుకు వెళ్తే కలిసి వస్తుందా..? అనేది ఇప్పుడు చిక్కు ప్రశ్న.
అయినా చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ఉండగా పాత పాట పాడవలసిన అవసరం లేదు. మరి కేసిఆర్ ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు.
చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఈ ప్రాంతీయత అస్త్రం కేసిఆర్ కి మళ్ళీ కలిసొస్తుందా..? లేదా..? అనేది మీరు కూడా కామెంట్ చేయండి.