KomatiReddy Venkat Reddy : అంతా తూచ్… కోమటిరెడ్డి..
ఎప్పుడూ సొంత పార్టీపైనే విమర్శలు.. ఊహించని వ్యాఖ్యలు చేసే కోమటిరెడ్డి.. తాజాగా మొన్న జరిగిన సంగతిపై నాలుక కరుచుకున్నట్టే కనిపిస్తుంది.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “త్వరలో జరిగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందని.. ఆ తరువాత బీజేపీ ని అడ్డుకోవడానికి లౌకికవాద స్వభావం కలిగిన పార్టీలు కాంగ్రెస్, BRS కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా పెద్దగా అశ్చర్యం లేదు” అని ఆయన చేసినవ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ధాక్రెతో జరిగిన భేటీలో మాత్రం సదరు విషయం పెద్దగా చర్చలోకి రాలేదని సమాచారం.
దీనితో ఈ ఊహగానాలకి.. కోమటిరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టే.. ఇవాళ కోమటిరెడ్డి “మాణిక్ రావుతో జరిగిన భేటీలో పార్టీ భవిష్యత్ గురించి తప్ప మిగతా వేటిపైన చర్చ జరగలేదని” వివరించారు. పైగా “కావాలనే మీడియానే తన వ్యాఖ్యలని తప్పుగా అర్ధం చేసుకుందని.. ప్రస్తుతం ఏ పార్టీతో పొత్తు ఆలోచన లేదని” వివరించారు కోమటిరెడ్డి.