KondaGattu Hanuman Temple : కొండగట్టు ఆలయానికి మహర్దశ..
ఈ మధ్య తరచూ వినబడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం..ఎన్నో ఏళ్ల నాటి ఈ ఆలయం ఉమ్మడి ఏపీలో సరైన ఆధారణకి అభివృద్ధికి నోచుకోలేదు.
ఈ మధ్య కాలంలో జనసేన అధినేత సందర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.. ఆ పర్యటన లో దాదాపు కొన్ని వేలమంది అభిమానులు పాల్గొనడం తో పాటు నిత్యం భక్తుల రాక క్రమ క్రమంగా ఎక్కువ అయ్యేసరికి అందరి చూపు కొండగట్టు పై పడింది..అయితే పవన్కళ్యాణ్ గారికి కొండగట్టుతో ప్రత్యేక అనుబంధం ఉంది.
గతంలో కొండగట్టు ఆలయ ప్రాంతం దగ్గర ఒకసారి అదృష్టవశాత్తు విధ్యుత్ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు.. ఇక అప్పటినుండి పవన్కళ్యాణ్ గారు.. తన ప్రాణాల్ని కొండగట్టు అంజన్నే కాపాడాడు అని అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు.. తరచూ కొండగట్టుకు వస్తున్నారు కూడా.. తాజాగా ఇటీవల తన ఎన్నికల వాహనం అయినటువంటి “వారాహి” వాహనానికి కూడా కొండగట్టు వద్దే ప్రత్యేక పూజలు చేయించడం విశేషం.
ఒకరకంగా చెప్పాలంటే కొండగట్టు ఆలయానికి పవన్కళ్యాణ్ ద్వారానే విశేష ఆదరణ వచ్చింది అనేది కాదనలేని వాస్తవం.. దీనితో తెలంగాణా ప్రభుత్వం కూడా కొండగట్టు పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఇందుకుగాను గతంలో 100 కోట్లు ఆలయ అభివృద్ధికి కేటాయించింది.
అయితే ఈరోజు స్వయంగా కొండగట్టు సందర్శించిన సియం కేసీయార్ గారు..గతంలో ప్రకటించిన 100 కోట్లకి అదనంగా మరో 500 కోట్లు కేటాయించి ఆలయ అభివృద్ధి త్వరగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు..
దీనితో కొండగట్టు ఆలయానికి అన్ని సమస్యలు తీరడం తో పాటు అభివృద్ధి చెందుతుంది అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీయార్ కి కొండగట్టుకు పాత అనుబంధం ఉన్నా కూడా పవన్కళ్యాణ్ గారి పర్యటనల ఫలితమే ఈ నిధులు అన్న భావన సామాన్యుల్లో భక్తుల్లో ఎక్కువగా ఉంది..