KTR’s Words about Congress : కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.. ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీ అయితే తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల కాలేశ్వరం వెళ్ళిన రాహుల్, రేవంత్ లు తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీనికి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి కాలేశ్వరం ప్రాజెక్టు ఒక వరమైతే.. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ.. అని అన్నారు
రాహుల్ గాంధీకి చరిత్ర తెలియదని, తెలుసుకునే సోయి లేదని తెలిపారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చెత్తాచెదారంగా ఆయన అభివర్ణించారు.. అలాగే టి పి సి సి అంటే తెలంగాణ పెరట్లో చెత్తాచెదారం అని దుయ్యబట్టారు.
అంతేకాకుండా రేవంత్ రెడ్డి, దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అని వ్యాఖ్యలు చేశారు.. బ్రిడ్జ్ ఎక్స్పాన్షన్ లెవెల్ చూపిస్తూ అది కూలిపోతుందని కాంగ్రెస్ వారు ఫోటోలు పెడుతున్నారు.. వీళ్ళు పెద్ద ఇంజనీర్లు.. ఇదీ వీళ్ళ అవగాహన అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతి సంపద కాళేశ్వరంపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.