Machilipatnam Janasena : అధికారంతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ.. జనసైనికులు ఎప్పుడూ ముందు ఉంటారు. మచిలీపట్నం బైపాస్ రోడ్ లోని వాసవి భవన్ దగ్గర వడ్డీ చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి డొక్కా సీతమ్మ గారి చలివేంద్రాన్ని బండి రామకృష్ణ గారి సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ..

వేసవికాలంలో పాదచర్లకు, వాహనదారులకు వేసవి దాహార్తి తీర్చుట కొరకు జనసైనికులు చేస్తున్న కృషి గర్వించదగినది అని కొనియాడారు. అధికారంలో ఉన్న పార్టీలు కూడా చేయని పని జన సైనికులు చేస్తున్నారని అభిన్సంధించారు. ఈ విధంగా భవిష్యత్తులో కూడా జనసైనికులు ముందుకు వెళ్లాలని రామకృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వార్డు ఇన్చార్జులు, జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
