Nandamuri Taraka Ratna Death : నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి – పవన్ కళ్యాణ్
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అన్నారు పవన్ కళ్యాణ్. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాననీ.. నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్న ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరమని ఆయన తెలిపారు..తారకరత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు జనసేనాని పవన్ కళ్యాణ్…
శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RmKnZZaSvv
— JanaSena Party (@JanaSenaParty) February 18, 2023